TET -3 & DSC నోటిఫికెషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి స్పష్టత ఇచ్చిన AP విద్యాశాఖ || AP Government Job Alerts 2020
ఆంధ్రప్రదేశ్ లో టెట్ -3,డిఎస్సీ నోటిఫికెషన్స్ కోసం చాల మంది వేచి చుస్తునారు. దీనిమీద స్పందించిన విద్యాశాఖ కరోనా లాక్ డౌన్ ఎత్తివేయగానే టెట్-3 నోటిఫికేషన్ ని విడుదల చెయ్యడానికి సర్వం సిద్ధంగా ఉందని విద్యాశాఖ వెల్లడించింది. టెట్ , డిఎస్సీ పరీక్షలను వేరు వేరుగా నిర్యహించబోతున్నామని మరియు ఉపాధ్యాయ అర్హత పరీక్షా ఆన్లైన్ లో నిర్వహించబోతున్నామని విద్యాశాఖ పేర్కొంది . లాక్ డౌన్ కారణంగా నోటిఫికేషన్ తేదీలను చెప్పకుండా మిగిలిన ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు టెట్ - 3 నిర్వహించిన అనంతరం 9 వేల పైచిలుకు పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ 2020 ని విడుదల చేయబోతున్నట్లుగా విద్యాశాఖ తెలిపింది. డిఎస్సీ 2020 నోటిఫికేషన్ లో 3000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 300 పీజీటీ , టీజీటీలు , 5 వేల కు పైగా ఎస్ జిటీ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు :
శ్రీకాకుళం - 550
విజయనగరం - 471
విశాఖపట్నం - 549
తూర్పు గోదావరి జిల్లా- 2097
పశ్చిమ గోదావరి జిల్లా - 507
కృష్ణ - 600
గుంటూరు - 520
నెల్లూరు - 575
కడప - 543
కర్నూల్ - 1546
అనంతపురం -471
ఆంధ్రప్రదేశ్ లో కరోనా లొక్డౌన్ తరవాత వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్ ని విడుదల చెయ్యబోతునట్టుగా విద్యాశాఖ పేర్కొంది. కావున అభ్యరధులంతా సిద్ధంగా ఉంది ఉద్యోగాలు తప్పక సాధించండి.
Comments
Post a Comment